మిరప, పసుపు మరియు కరివేపాకు పంటలలో జీవ సంబoధమైన యాజమాన్య పద్ధతులు.
కరివేపాకు- 5000 మొక్కలు ఎకరాకు
కరివేపాకును పరిస్థితులను బట్టి నీటి పారుదల పంటగా, నీరు లేనపుడు మెట్ట పొలాల్లో వర్షాధార పంటగా సాగు చేయవచ్చు. ఇది నిలువుగా పెరిగే బహు శాఖీయ, బహు వార్షిక పొద. దీని ఆకులు మంచి సువాసన కలిగి ఉంటాయి. కరివేపాకు దక్షిణ భారత వంటకాల్లో తప్పకుండా ఉపయోగిస్తారు.
ఋతుపవనాలకు ముందు జూన్ – జులై : మొదట సారి వాడవలెను
ఋతుపవనాలకు తరువాత డిసెంబర్ – జనవరి : రెండవ సారి వాడవలెను
గుంతలలో వేయుటకు:
ఒక్కొక్క మొక్కకు 100 గ్రాముల య౦.ఇ.యం, పశువుల ఎరువు 5 కేజీల నుండి 7 కేజిలు చొప్పున మరియు ఒక ఎకరమునకు య౦.ఇ.యం 500 కేజీలు మరియు పశువుల ఎరువు 5 నుండి 7 టన్నులు చొప్పున వాడవలెను
- సూక్ష్మజీవుల సమృద్ధి మిశ్రమం( యం.ఇ.యం) తయారి చేయు విధానం :
పూర్తిగా చివికిన ఆవు పేడ | = | 350 కేజీలు |
వరి వూక | = | 100 కేజీలు |
బూడిద | = | 50 కేజీలు |
- జీవ ఎరువులు:-
అజోస్పైరిల్లo | = | 2కేజీలు(నత్రజని కోసం) |
ఫాస్ఫో బాక్టీరియo | = | 2కేజీలు(ఫాస్ఫరస్ కోసం) |
పొటాష్ సమీకరించే బాక్టీరియo | = | 2కేజీలు( పొటాష్ కోసం) |
వ్యామ్ | = | 5 కేజీలు (వేరు వృద్ధి కోసం) |
సూడోమోనాస్ | = | 2 కేజీలు ( తెగుళ్ల నివారణ) |
ట్రైకోడెర్మ విరిడి | = | 2 కేజీలు (తెగుళ్ల నివారణ) |
అముధ౦ మిశ్రమం (లేదా) జీవామృతం | = | 50 లీటర్లు |
మజ్జిగ మిశ్రమం | = | 5 లీటర్లు |
ఇ.బి.య౦.సి (ఉపయోగకరమైన సూక్ష్మ | = | 1 లీటర |
పై రెండు (I & II) మిశ్రమాలను బాగా కలిపి 100 గ్రాముల చొప్పున మొక్కకు వాడవలెను.
బిందు సేద్య పద్ధతి లేదా వరద నీటిపారుదలకు అనుగుణంగా ద్రావణాన్ని తయారు చేసుకొనుట:
అముధ౦ మిశ్రమం లేక జీవామృతం | = | 50 లీటర్లు |
మజ్జిగ మిశ్రమం | = | 3 to 5 లీటర్లు |
ప౦చగవ్య | = | 3 to 5 లీటర్లు |
1) ఘనజీవామ్రుత౦ (నైలాన్ బ్యాగ్ వాడoడి) - 2 కేజీలు – 3 కేజీలు
2) గానుగ చెక్క/ఆముదం చెక్క / - 2 కేజీలు – 5కేజీలు ఒక నెల వరకు
నువ్వుల చెక్క (నైలాన్ బ్యాగ్ వాడoడి)
మొక్క పెరుగుదలకు, చీడ పీడల మరియు తెగుళ్ల అరికట్టుటకు ముందస్తు పిచికారి చేయవలెను.
పిచికారి నిమిత్తం100 లీటర్ల ద్రావణాన్ని తయారు చేయుటకు:-
అముధ౦ మిశ్రమం (లేదా) జీవామృతం | = | 10 లీటర్లు |
ఆకుల రసాల మిశ్రమం | = | 5 లీటర్లు |
గేదె పేడ మిశ్రమం | = | 25 లీటర్లు (10కేజీల గేదె పేడ+ 15 లీటర్ల నీరు) |
నీరు | = | 60 లీటర్లు |
మొత్తం | = | 100 లీటర్లు |
వారానికి ఒకసారి పిచికారి చేసుకొనవచ్చును.
అముధ౦ మిశ్రమం:
ఆవు పెడ లేదా గేదె పేడ | = | 1 కేజి |
ఆవు మూత్రం లేదా గేదె మూత్రం | = | 1లీటరు |
బెల్లం | = | 250 గ్రాములు |
నీరు | = | 10 లీటర్లు |
పాడైన పoడ్లు (నైలాన్ బ్యాగ్ లో) | = | 1కేజి |
ఒక రోజు పులియబెట్టిన తర్వాత ఉపయోగించవలెను.
మజ్జిగ ద్రావణం:
మజ్జిగ | = | 4లీటర్లు |
కొబ్బరి నీళ్ళు | = | 2లీటర్లు |
పసుపు | = | 100 గ్రాములు |
ఇంగువ | = | 25 గ్రాములు |
బెల్లo | = | 200 గ్రాములు |
4% ఆల్కాహల్ లేదా కల్లు | = | 100 మి.లీ |
మూడు రోజులపాటు పులియబెట్టిన తర్వాత ఉపయోగించవలెను.
ఆకుల వడపోత ద్రావణం:
ఆవు పేడ లేదా గేదె పేడ | = | 1 కేజి |
ఆవు మూత్రం లేదా గేదె మూత్రం | = | 10 లీటర్లు |
నిమ్మ రసం | = | 5-10 మి.లీ |
వేపాకులు | = | 250 గ్రాములు |
ఉమ్మెత్త ఆకులు | = | 250 గ్రాములు |
జిల్లేడు ఆకులు | = | 250 గ్రాములు ీ |
ఏడు రోజులపాటు పులియబెట్టి తర్వాత ఉపయోగించవలెను.
ఉపయోగకరమైన సూక్ష్మజీవుల సంఘటిత మిశ్రమము( బి.యం.సి):
బి.యం.సి –1 లీటరు
నీరు –18 లీటర్లు(రైతులు నీటి పారుదలకు ఉపయోగించే నీటిని ఉపయోగించవచ్చు)
బెల్లం –1కేజి
పైన చెప్పినవన్నీయు కలిపినట్లయితే 20 లీటర్ల మిశ్రమం తయారవుతుంది. ఈ మిశ్రమాన్ని ఒక్కొక్క లీటరు చొప్పున 20 బాటిల్లలో పోయవలెను, తర్వాత ఏడు రోజుల పాటు నిల్వ వుంచి వాడవలెను.
1.నీటి పారుదల కోసం ఉపయోగించుటకు ఒక లీటరు ఇ-బి.యం.సి ద్రావణాన్ని 200లీటర్ల ఫిల్టర్ బ్యారెల్లలో కలిపి వారానికి ఒకసారి వాడవలెను.
2. పిచికారి చేయుట కొరకు 1 లీటరు ఇ-బి.యం.సి ద్రావణాన్ని 100 లీటర్ల మిశ్రమంలో కలుపవలెను.
కార్యాలయాల కొరకు ఇ.యం. 2 తయారు చేసుకొను విధానం:
ఇ.య౦.సి. | = | 200 మి.లీ |
బెల్లం | = | 200 గ్రాములు |
నీరు | = | 4లీటర్లు. |
పైన చెప్పినవన్నిబాగా కలిపి ఒక మిశ్రమంగా తయారు చేసి 7 రోజుల పాటు నిల్వ ఉంచి, తర్వాత ఉపయోగించుకోనవచ్చును.
నీటి పారుదలలో ఉపయోగించుటకు:
100మి.లీ ఇ.య౦ 2 ద్రావణ౦ను 10 లీటర్ల నీటికి కలిపి ప్రతి మొక్క మొదళ్ళలో పోయవలెను.
మిరప
మిరపకున్న ఉపయోగాల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా అధికంగా వాడుకలో ఉన్న సుగంధ ద్రవ్యం. మిరపను ఆరోగ్య సంవర్ధక పదార్ధాలలోను మరియు ఔషధ తయారీలోను ఉపయోగిస్తారు. మిరప యొక్క సహజ రంగు వలన సౌందర్య ఉత్పత్తుల ఔషధాల తయారీలో వాడతారు.
అఫ్లోటాక్సిన్ మరియు పురుగు మందుల అవశేషాలు లేకుండా నాణ్యమైన మిరపను అధికంగా ఉత్పత్తి చేయాలి. కేవలం నాణ్యమైన మిరపకు మాత్రమే మంచి మార్కెట్ మరియు ధర లభిస్తుంది.
మిరప మన దేశంలో ముఖ్యమైన వాణిజ్య పంట. మన దేశo ప్రపంచంలో అధికంగా మిరపను పండించుచున్నది. భారత దేశంలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ మిరప ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్నవి. కాప్సిసిన్ మిరప కాయకు ఘాటును కలిగించే ముఖ్యమైన పదార్ధము, మిరపకాయలలో ౦.2-1.5 శాతం వరకు ఉంటుంది. కాప్సిసిన్ అను ఆల్కలాయిడ్ తగు మోతాదులో తీసుకొనినపుడు మన శరీరంలో జీర్ణక్రియను ఉత్తేజపరుస్తు౦ది. గుండె జబ్బు, కాన్సర్ వంటి వ్యాధులు రాకుండా చేస్తుంది కావున దీనిని ఔషధముల తయారీలో ఉపయోగించుచున్నారు.
ఎండు మిరపకాయల నుండి వేరు చేసిన సుగంధ ద్రవ్యాన్ని ఒలియోరెసిన్ అంటారు. దీనిలో మిరపకాయలలో ఉండే రంగు , రుచి, వాసనలతో పాటు ముఖ్యమైన నూనెలు , క్రొవ్వు పదార్ధాలు ఉండును గనుక దీనిని బేకరి పదార్దముల తయారు చేయు పరిశ్రమలలో వినియోగిస్తున్నారు.
విటమిన్ ‘ఎ’, ‘ సి’ లు మిరపలో ఎక్కువగా ఉండును. కoటి ఆరోగ్యమునకు ‘ఎ’ విటమిను మరియు ఎముకల మరియు దంతాల ఆరోగ్యమునకు విటమిన్ ‘సి’ ఉపయోగపడును.
ఒక సెంటు నారుమడికి – యం.ఇ.యం తయారు చేయు విధానం:-
- ఆవు పేడ ఎరువు లేదా గేదె పెడ ఎరువు = 100 కేజీలు
- జీవ ఎరువులు:-
అజోస్పైరిల్లం | = | ½ కేజీ |
ఫాస్ఫో బాక్టీరియం | = | ½ కేజీ |
పోటాష్ సమీకరణ చేసే బాక్టీరియం | = | ½ కేజీ |
వ్యామ్ | = | 1 కేజీ |
- జీవ శిళీంద్ర నాశకాలు-వేరుకు ఆశించే తెగుళ్ళను ను నివారించుటకు
సూడోమోనాస్ | = | ½ కేజీ |
ట్రైకోడెర్మ విరిడి | = | ½ కేజీ |
ట్రైకోడెర్మ హారిజోనం | = | ½ కేజీ |
బాసిల్లస్ సబ్టిలిస్ | = | ½ కేజీ |
పెసిలోమైసిస్ | = | ½ కేజీ |
- పొలంలో తయారు చేసుకోను విధానం:-
అముధ౦ మిశ్రమం(లేదా) జీవమృతం | = | 6లీటర్లు |
పంచగవ్య | = | 2 లీటర్లు |
మజ్జిగ ద్రావణం | = | 2 లీటర్లు |
ఇ.బి.యం.సి | = | ½ లీటర్లు |
బాగా చివికిన ఆవు పేడ లేదా గేదె పేడ ను మెత్తగా చేసుకొని ,పైన చెప్పినటువంటి జీవ ఎరువులను , జీవ శిలీంధ్ర నాశకాలను బాగా కలుపవలెను. తర్వాత పైన చెప్పినటువంటి అముధం మిశ్రమం/ జీవమృతం, పంచగవ్య, మజ్జిగ ద్రావణం , ఇ.బి.యం.సి ల మిశ్రమాన్ని పైన చల్లుతూ సమానమైన తేమ వచ్చే వరకు బాగా కలుపవలెను.
నారుమడిని తయారు చేసుకున్న తర్వాత యం.ఇ.యం మిశ్రమం ను నారు మడిపై చల్లి మట్టిలో కలుపవలెను.తర్వాత 100 గ్రాముల మిరప విత్తనాలు చల్లి, సమానంగా మట్టి కప్పవలెను. తర్వాత నీటి తడులను పెట్టి మొక్క అనుకూలమైన ఎత్తు ఎదిగిన తర్వాత ప్రధాన పొలంలో నాటవలెను.
ప్రధాన పొలం తయారు చేయు విధానం:
జనుము | = | 11కేజీలు |
జీలుగ | = | 11కేజీలు |
సజ్జ | = | 3కేజీలు |
అముధ౦ | = | 5కేజీలు |
మొత్తం | = | 30కేజీలు ఒక ఎకరాకు |
మిరప మొక్కలు నాటక ముందు 60 నుండి 70 మిశ్రమ పంట రకాల విత్తనాలను విత్తుకోనవచ్చును.
రైతులు వారికి తగిన విధంగా పైన చెప్పిన పంటల విత్తన మోతాదు మార్చుకొనవచ్చూ. అవసరమైనపుడు నీటి పారుదల సౌకర్యం అందించి మొక్కలు ఎదిగాక రోటావేటార్ కలియ దున్ని భూమి లో కలుపవలెను.
ప్రధాన పొలం తయారిలో తీసుకోవల్సిన జాగ్రత్తలు:
దుక్కిలో వేయుటకు:- యం.ఇ.యం ఒక ఎకరాకు
- కుళ్లిన ఎరువు/వర్మి కంపోస్ట్/చివికిన ఆవు పేడ/గొర్రెల, మేకల ఎరువు = 100కేజీలు నుండి 200 కేజీలు
- జీవ ఎరువులు:-
అజోస్పైరిల్లం | = | 2కేజీలు |
పాస్ఫో బాక్టీరియం | = | 2కేజీలు |
పోటాష్ సమీకరణ చేసే బాక్టీరియం | = | 2 కేజీలు |
వ్యామ్ | = | 5 కేజీలు |
- జీవ శిలీంధ్రక నాశకాలు:
సూడోమోనాస్ | = | 2కేజీలు |
బాసిల్లస్ సబ్టిలిస్ | = | 2కేజీలు |
ట్రైకోడెర్మ విరిడి | = | 2 కేజీలు |
ట్రైకోడెర్మ హారిజోనం | = | 2 కేజీలు |
- జీవ నెమటోడ్ నాశకాలు
పెసిలోమైసిస్ = 2 కేజీలు
- పొలంలో తయారు చేసుకొనుటకు:-
అముధ౦ మిశ్రమం (లేదా) జీవామృతం | = | 10 లీటర్లు |
పంచగవ్య | = | 5 లీటర్లు |
మజ్జిగ ద్రావణం | = | 5 లీటర్లు |
గమనిక:
పైన వివరించిన కుళ్లిన ఎరువు/వర్మి కంపోస్ట్/చివికిన ఆవు పేడ/గొర్రెల, మేకల ఎరువు ను పొడిగా చేసి దాని పైన జీవ ఎరువులు , జీవ శిలీంధ్రక నాశకాలు, జీవ నెమటోడ్ నాశకాలను బాగా కలపాలి.ఆ తర్వాత అముధం మిశ్రమం (లేదా) జీవామృతం, పంచగవ్య, మజ్జిగ మిశ్రమం లను పైన చిలకరించాలి. సమానమైన తేమ వచ్చే వరకు కలపాలి.
దుక్కులలో వేయుటకు:
ఆకరి దుక్కిలో కంపోస్ట్ 20 టన్నుల చొప్పున వేయాలి. ఆ తర్వాత యం ఇ యం తయారు చేసుకున్నది వేయాలి . ఈ విధంగా చేసినట్లయితే నేల మిర్చి మొక్కలు నాటుటకు సిద్దంగా ఉన్నట్లు.
నాటిన 45 రోజుల నుంచి 15 రోజులకొకసారి ఈ క్రింద విధంగా తాయారు చేయబడిన పండ్ల ద్రావణంను వాడవలెను:
1) ౩ కేజీల అముధ౦ చెక్క + అజోస్పైరిల్లం, పాస్ఫో బాక్టీరియం, పోటాష్ సమీకరణ చేసే బాక్టీరియం, వ్యామ్ లు ఒక్కొక్కటి 1 కేజీ చెప్పున
2) ౩ కేజీల అముధ౦ చెక్క + సూడోమోనాస్, బాసిల్లస్ సబ్టిలిస్ = ఒక్కొక్కటి 1 కేజీ చెప్పున
3) ౩ కేజీల అముధ౦ చెక్క + ట్రైకోడెర్మ విరిడి, ట్రైకోడెర్మ హారిజోనం = ఒక్కొక్కటి 1 కేజీ చెప్పున
4) 2 కేజీల అముధ౦ చెక్క + పెసిలోమైసిస్ = ఒక్కొక్కటి 1 కేజీ చెప్పున
5) ౩ కేజీల పాడయిన పoడ్లు
పొలంలో పిచికారి కొరకు ద్రావణాన్నితయారు చేసుకొనుటకు:-
అముధ౦ మిశ్రమం (లేదా) జీవామృతం | = | 50 లీటర్లు |
పంచగవ్య౦ | = | 3-4 లీటర్లు |
మజ్జిగ ద్రావణం | = | 3-4 లీటర్లు |
ఇ.బి.యం.సి | = | 1 లీటరు |
147 లీటర్ల నీటిని కలిపి మొత్తం 200 లీటర్లు మిశ్రమాన్ని తయారు చేసి 7 రోజుల పాటు కుళ్ళింప చేయాలి.
గమనిక:
100 లీటర్ల ద్రావణాన్ని ఒక ఎకరాకు మొక్క యొక్క చిన్న వయస్సులో ఉపయోగించవచ్చు. మొక్క వయస్సు పెరిగిన కొద్దీ 200 లీటర్ల వరకు ద్రావణాన్ని ఉపయోగించవచ్చు.
సాధారణంగా 7 నుండి 15 రోజుల వ్యవధిలో పిచికారి చేయుటకు మిశ్రమాన్ని తాయారు చేయుట :-
ఆవు/గేదె/గొర్రె/మేక పేడ10 కేజీలు +250గ్రాముల బెల్లం +15 లీటర్ల నీరు | = | 25 లీటర్లు |
అముధ౦ మిశ్రమం (లేదా) జీవామృతం | = | 10 లీటర్లు |
మజ్జిగ మిశ్రమం | = | 3లీటర్లు |
ఆకుల వడపోత మిశ్రమం/ఆవు మూత్రం/ గేదె మూత్రం | = | 5 లీటర్లు |
నీరు | = | 57 లీటర్లు |
మొత్తము మిశ్రమం | = | 100 లీటర్లు |
పసుపు
పసుపు దుంప జాతికి చెందిన, పురాతన మరియు పవిత్రమైన సుగంధ ద్రవ్యపు పంట. పసుపు సాంప్రదాయకరమైన వేడుకలలోనే గాక ఒక పరిమళ ద్రవ్యంగా రంగుగా , ఔషధంగా మరియు సౌందర్య ఉత్పత్తులలో ఉపయోగపడుతుంది. ప్రపంచంలో పసుపు వాడకంలో, ఉత్పత్తిలో మరియు ఎగుమతి లో భారత దేశం ప్రముఖమైనది.
దుంపల్లోని పసుపు పచ్చదనం (కుర్కుమిన్) మరియు సుగంధ తైలం (2-6%) వలన దీనిని ఆహార పదార్ధాలకు రంగు, రుచి, సువాసనలు చేర్చుటకు, ఔషధాలలోను, చర్మ సౌందర్యానికి వన్నె తెచ్చే పరిమళ ద్రవ్యాల తయారీలోను మరియు రంగుల పరిశ్రమల్లోను ఉపయోగిస్తారు. అధిక కుర్కుమిన్ కల పసుపు రకాలకు మార్కెట్ కలదు.
మన రాష్ట్రం లో 71,488హెక్టారులలో సాగుచేయబడుతూ 4,43,226 టన్నుల దిగుబడినిస్తుంది. తెలంగాణలో పసుపు పండించే ముఖ్యమైన ప్రాంతాలు నిజామాబాద్, కరీంనగర్, మెదక్,ఆదిలాబాద్, వరంగల్ మరియు ఆంధ్రప్రదేశ్ కడప, కర్నూల్, గుంటూరు, కృష్ణా, విశాఖపట్టణం, కొంతవరకు ఖమ్మం, తూర్పు, పశ్చిమ గోదావరి మరియు శ్రీకాకుళం జిల్లాలు.
చిన్న దేశాలైనటువంటి జమైకా, తైవాన్ నాణ్యమైన పసుపును మన కంటే తక్కువ ధరకు అమ్మడానికి అంతర్జాతీయ మార్కెట్ లో పోటీ పడుతున్నాయి. కావున అంతర్జాతీయ మార్కెట్ ను దృష్టిలో ఉంచుకొని నాణ్యమైన పసుపును పండించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అధిక కుర్కుమిన్ శాతం(5.5%) గల అలెప్పి పసుపుకు మంచి వాణిజ్య మార్కెట్ ఉంది.
మిశ్రమ పంట రకాల విత్తన మోతాదు ఒక ఎకరాకు:
జీలుగ | = | 11 కేజీలు |
జనుము | = | 11 కేజీలు |
సజ్జ | = | 2 కేజీలు |
జొన్న | = | 1 కేజీలు |
ఆముదం | = | 3 కేజీలు |
మొత్తం | = | 30 కేజీలు ఒక ఎకరాకు |
1. విత్తనం విత్తిన తర్వాత 60 రోజుల పాటు పెంచవలెను.
2. విత్తనం నాటిన నెల రోజుల తర్వాత ఎం.ఇ.ఎం ను వాడవలెను.
(కంపోస్ట్ (లేదా) ఆవు పేడ ఎరువు (లేదా) గేదె పేడ ఎరువు – 100 to 200 కేజీలు)
3. అజోస్పైరిల్లం, పాస్ఫో బాక్టీరియం, పొటాష్ సమీకరణ చేసే బాక్టీరియం = ఒక్కొక్కటి 2 కేజీలు చెప్పున + వ్యామ్ = 5 కేజీలు
4. సూడోమోనాస్, బాసిల్లస్ సబ్టిలిస్, ట్రైకోడెర్మ విరిడి, ట్రైకోడెర్మ హారిజోనం = ఒక్కొక్కటి 2 కేజీలు చెప్పున
5. పెసిలోమైసిస్ = 5 కేజీలు
6. పొలమునందు తయారు చేయదగ్గ మిశ్రమాలు:
అముధ౦ మిశ్రమం ( లేదా) జీవామృతం | = | 20 to 40 లీటర్లు |
పంచగవ్య | = | 3 to 6 లీటర్లు |
మజ్జిగ మిశ్రమం | = | 3 to 6 లీటర్లు |
ఇ.బి.యం.సి | = | 1 లీటరు |
ఆముదం | = | 3 కేజీలు |
మొత్తం | = | 30 కేజీలు ఒక ఎకరాకు |
పైవన్నికలిపిన మిశ్రమాన్నిఒక ఎకరమునకు వాడవలయును మరియు 60 రోజుల వరకు తడులు ఇవ్వవలెను తదుపరి రోటవేటార్ సహాయంతో కలియ దున్నవలెను. తరువాత ఎకరరమునకు 10 టన్నుల చివికిన ఆవుల పేడ లేదా గేదెల పేడను వాడవలయును. ఆ తర్వాత పసుపు కొమ్ములను నాటుటకు నేలను సిద్ధం చేసుకొనవలయును.
విత్తిన 45 రోజుల తర్వాత పండ్ల ద్రావణం 15 రోజులకు ఒకసారి లేదా నెలకొకసారి పంట పెరుగుదలను బట్టి వాడవలెను.
- పైన చెప్పిన జీవ పదార్ధములను ఆముదపు చెక్క తో కలిపి వడపోత డ్రమ్ము లో వాడవలయును మరియు పై పదార్ధములను తిరిగి నాలుగు సార్లు వాడవచ్చును. కాని ప్రతిసారి పొలంలో తయారుచేసిన మిశ్రమమును మరియు నీటిని నింపి వాడవలెను. ఆకులన్నీబాగా చివికిన తదుపరి మిగిలిన ఈనెలను తీసివేసి కొత్త ఆకులతో డ్రమ్మును నింపవలయును.
- ఈ జీవ పదార్ధములనునాలుగు సార్లు వాడిన తర్వాత, కొత్త జీవ పదార్ధములను మరియు ఒకటి లేదా రెండు కేజీల ఆముదపు చెక్కతో కలిపి సంచులలో నింపి డ్రమ్ములలో పెట్టవలయును.
- వర్షాకాలంలో పొలంలో దుంప కుళ్ళు ను సమూహాలుగా గమనించినట్లయితే ఈ సుక్ష్మ జీవుల సమృద్ధి మిశ్రమాన్ని 7 నుండి 10 రోజులకొకసారి చొప్పున 3 నుంచి 4 సార్లు వాడినట్లయితే తెగుళ్ళు యొక్క వ్యాప్తిని అరికట్టవచ్చును.
పిచికారి వివరాలు:
అముధ౦ మిశ్రమం ( లేదా) జీవామృతం | = | 10 లీటర్లు |
పంచగవ్య | = | 3 లీటర్లు |
మజ్జిగ ద్రావణ | = | 3 లీట |
గేదె పేడ | = | 25 లీటర్లు |
ఆవు మూత్రం | = | 5 - 10 లీటర్లు |
సూడోమోనాస్ | = | 300 - 500 మి.లీ |
నీరు | = | 50 లీటర్లు |
మొత్తం | = | 100 లీటర్లు |
పై మిశ్రమంను 15 లేదా ౩౦ రోజులకొకసారి పంట యొక్క పరిస్థితిని బట్టి పిచికారి చేయవలెను.
పసుపులో తామర పురుగులు మరో సమస్య. ఈ సమస్య నీడ ప్రాంతం నుండి మొదలవుతుంది. కావున నీడ ప్రాంతం లో క్రమం తప్ప కుండ గేదె మూత్రం ను పిచికారి చేయవలెను.ఈ విధంగా చేసి ఈ సమస్యను అధిగమింవచ్చు.
అముధ౦ మిశ్రమం:
ఆవు పేడ 1 కేజీ + ఆవు మూత్రం 1 లీటరు + బెల్లం 250 గ్రాములు మరియు నీరు 10 లీటర్లు కలిపి పులియబెట్టిన యెడల ఉపయోగించుటకు సిద్ధంగా ఉండును.
మజ్జిగ ద్రావణం:
మజ్జిగ 4 లీటర్లు +లేత కొబ్బరి నీళ్ళు 2 లీటర్లు + పసుపు పొడి 100 గ్రాములు+ ఇంగువ 25 గ్రాములు + బెల్లం 200 గ్రాములు+ కల్లు 1 లీటరు మరియు పాడైన పండ్లు ½ కేజీ ని కలిపి ౩ రోజుల పాటు పులియబెట్టిన యెడల ఉపయోగించుటకు సిద్ధంగా ఉండును.
ఈ ద్రావణ౦నకు పిడికెడు తులసి ఆకులు , పిడికెడు వేప ఆకులు మరియు పిడికెడు కరివేపాకులను చిన్న చిన్న ముక్కలుగా చేసి కలుపవలయును.
గేదె పేడ ద్రావణ౦ :
గేదె పేడ 1 కేజి బెల్లం, 200 గ్రాములు మరియు నీళ్ళు 10 లీటర్లు కలిపి 3 రోజుల పాటు పులియబెట్టిన యెడల ఉపయోగించుటకు సిద్ధంగా ఉండును.
గమనిక:
పై ద్రావణానికి ½ కేజీ to 1 కేజీ ఏదైనా పండ్ల వ్యర్ధంను కలిపి నైలాన్ సంచి లో ఉంచి ఎక్కువ రోజులు నిల్వ చేసుకొనవచ్చును మరియు వాడుకోనవచ్చును.
మిరప, పసుపు మరియు కరివేపాకు పంటలలో జీవ సంబoధమైన యాజమాన్య పద్ధతులతో సాగు చేస్తున్న సేంద్రీయ రైతు యొక్క ప్రయోగాలు మరియు అనుభవాలు.
(అధిక సమాచారం కొరకు క్రింద పేర్కొనబడిన రైతును సంప్రదించగలరు)
రైతు పేరు మరియు చిరునామ |